‘బాహుబలి’ స్పెషల్ షో !
Published on Feb 23, 2017 8:00 am IST


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి – ది బిగినింగ్’ ఎంతటి విజయం సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘బాహుబలి 2’ ఇంకో రెండు నెలల్లో రిలీజ్ కానున్నా ప్రేక్షకులపై ఈ మొదటి భాగం ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు అమితోత్సాహంతో ఉన్నారు. అందుకే బాహుబలిని మరోసారి థియేటర్లలో ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతోంది.

రేపు ఫిబ్రవరి 24న మహాశివరాత్రి సందర్బంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో ‘బాహుబలి – ది బిగినింగ్’ సెకండ్ షోను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయం తెలిసిన బాహుబలి వీరాభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ఎంతో సంతోషపడుతూ థియేటర్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు. ఈ షోకు సంబందించిన టికెట్లు కూడా ఇప్పటికే సగం పైగా అమ్ముడుపోయాయి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘బాహుబలి 2’ ఎలాంటి ఆలస్యం లేకుండా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

 
Like us on Facebook