‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే !

Mokshagna-1
‘నందమూరి బాలకృష్ణ’ తనయుడు ‘మోక్షజ్ఞ’ వెండి తెర పై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ కూడా పలు సందర్భాల్లో మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలనే ఉత్సాహంతో ఉన్నాడని అన్నారు. దీంతో మోక్షజ్ఞ ముందుగా బాలకృష్ణ 100వ చిత్రంలో యువరాజు పాత్రలో కనిపిస్తాడని, ఆదిత్య 369 కి సీక్వెల్ లో నటిస్తాడని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వీటిలో దేనిపైనా ఖచ్చితమైన క్లారిటీ రాలేదు.

కానీ ఇప్పుడు స్వయంగా బాలకృష్ణ గారే తన వారసుడు 2017వ సంవత్సరం ఆఖరిలో హీరోగా రాబోతున్నాడని తేల్చేశారట. ఈ వార్త తెలియగానే నందమూరి అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ఇకపోతే బాలకృష్ణ చేస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా 2017 సంక్రాతికి విడుదలకానుంది.