బాలయ్యతో లవ్ సీన్స్ తీస్తారట !

Published on May 3, 2021 7:02 am IST

బాలయ్య ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది ‘ప్రగ్యా జైస్వాల్’. అఖండ గత వారం వరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ షూట్ లో ‘ప్రగ్యా జైస్వాల్’ కూడా పాల్గొంది. అయితే, మళ్ళీ మే 12 నుండి షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలయ్య – ప్రగ్యా పై కొన్ని లవ్ సీన్స్ తీస్తారట. ఈ లవ్ సీన్స్ సినిమాకే కీలకమైన సన్నివేశాలు అని తెలుస్తోంది. ఇక బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాలు తరువాత అఖండ టీజర్ సాధించిన 50 మిలియన్ల వ్యూస్ ను చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ తో పాటు మరో హీరోయిన్ పూర్ణ కూడా నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :