ఆడియో విడుదలకు సిద్దమైన ‘బెలూన్’ !
Published on Dec 4, 2017 5:56 pm IST

తమిళ హీరో జై, హీరోయిన్ అంజలి నటించిన తాజా చిత్రం ‘బెలూన్’. ఈ మూవీ తెలుగులో అదే పేరుతో రిలీజ్ కానుంది. హ‌ర్ర‌ర్ నేప‌థ్యంతో రూపొందుతున్న ఈ మూవీకి సినీష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అంజ‌లి దెయ్యంగా భయపెడితే , జై జోక‌ర్ గా నవ్వించబోతున్నాడు. రేపే ఈ సినిమా ఆడియో విడుదలకానుంది.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో హీరో రాజ్ త‌రుణ్ ఒక కీల‌క‌ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అంజలి , జై కలిసి నటించిన ‘జర్నీ’ సినిమా మంచి విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘బెలూన్’ టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

 
Like us on Facebook