10 మిలియన్ల మార్కును తాకిన ‘భరత్ అనే నేను’ టీజర్ !
Published on Mar 7, 2018 4:42 pm IST

నిన్న సాయంత్రం ‘విజన్ ఆఫ్ భరత్’ పేరుతో విడుదలైన మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై అంచనాల్ని పెంచేలా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులు, అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో టీజర్ పూర్తిగా 24 గంటలు కూడ గడవకముందే 10 మిలియన్ల అనగా కోటి వ్యూస్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది.

యూట్యూబ్ మాధ్యమం ద్వారా 7 మిలియన్ల వ్యూస్ పొందిన టీజర్ పేస్ బుక్ ద్వారా ఇంకో 3 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని మహేష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపించింది. ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రం ద్వారా కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయంకానుంది. ఈ ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాను డివివి. దానయ్య నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook