నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Oct 9, 2026 10:47 AM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు ఓ సాలిడ్ కంబ్యాక్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ హిట్ కొట్టేందుకు తాను చేస్తున్న తాజా చిత్రమే ‘అలియాస్ రుక్మిణి’. దర్శకుడు మురళికాంత్ తెరకెక్కిస్తున్న ఈ రోమ్ కామ్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

నితిన్ పై ఓ సింపుల్ పోస్టర్ ని విడుదల చేసి ఈ సినిమాని డిసెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఈ సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహిస్తుండడంతో మినిమమ్ గ్యారెంటీ సినిమా అనే ముద్ర అయితే పడింది.అలాగే ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు