భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్లాన్ చేసారా ?
Published on Mar 10, 2018 6:44 pm IST

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. దేవి అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ కాబోతోందని సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను వైజాగ్ లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.

ఏప్రిల్ మొదటి వారంలో ఈ వేడుకను భారీగా చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. మహేష్ బాబు ఫాదర్ పాత్రలో శరత్ కుమార్ నటించిన నటించగా ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటించాడు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook