శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తున్న మహేష్ బాబు !
Published on Nov 29, 2017 9:28 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఇంకో మూడు షెడ్యూళ్ళల్లో మొత్తం చిత్రీకరణను ముగించుకోనుంది. ఈ మూడు షెడ్యూళ్ళలో ఒకటి రేపు 30వ తేదీ నుండి డిసెంబర్ 7వరకు హైదరాబాద్లో జరగనుంది.

దీని తర్వాత డిసెంబర్ 10 నుండి 25 వరకు తమిళనాడులోని కారైకుడిలో మరొక షెడ్యూల్ జరగనుంది జరగనుంది. ఇవి కాకుండా మూడు పాటలు, ఒక ఫైట్ ను వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook