మహేష్ సినిమాలో ‘బిచ్చగాడు’ ఫేం..!

24th, July 2016 - 10:44:28 AM

Dheepa-Ramanujan
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు పక్కాగా సిద్ధమైన విషయం తెలిసిందే. సౌతిండియన్ లెవెల్లో తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందునుంచే ఈ సినిమా మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ‘బిచ్చగాడు’ ఫేం దీపా రామానుజన్ మహేష్‌కు తల్లిగా నటించనున్నారని తెలిసింది. ‘బిచ్చగాడు’లోనూ హీరో తల్లిగా నటించిన దీపా, తన పాత్రతో అందరినీ కట్టిపడేశారు.

ఇక రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‍గా నటించనున్న ఈ సినిమా జూలై 29న సెట్స్‌పైకి వెళ్ళనుంది. హైద్రాబాద్, చెన్నై, ముంబై, పూణే, గుజరాత్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్-ఠాగూర్ మధు భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.