సూపర్ స్టార్ సినిమాకు బాలివుడ్ టెక్నిషియన్ !
Published on Mar 2, 2018 4:07 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మాతలుగా రూపొందుతున్న సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. మహేష్ చేసే 25వ సినిమా కావడంతో ఈ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకోసం ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ కె.యు.మోహనన్ వర్క్ చెయ్యబోతున్నాడు. గతంలో ఈ సినిమటోగ్రఫర్ తలష్, డాన్, రీల్స్ వంటి బాలివుడ్ సినిమాకు వర్క్ చెయ్యడం జరిగింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ప్రారంభం అయ్యాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు మహేష్ బాబు.

 
Like us on Facebook