వరుణ్ తేజ్ సినిమాలో బాలీవుడ్ నటి ?
Published on Mar 12, 2018 8:41 am IST


మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో తేజ్ ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు తేజ్.

ఇకపోతే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరిని ప్రాజెక్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుందట. ఇక చిత్రంలో ప్రధాన హీరోయిన్, వరుణ్ తేజ్ కు జోడీ ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది.

 
Like us on Facebook