‘నిన్ను కోరి’ కథను ఫోన్ చేసి మరీ విన్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ !
Published on Jul 6, 2017 11:49 am IST


వరుస విజయాలతో మంచి సక్సెస్ రేట్ ను మైంటైన్ చేస్తూ అటు నిర్మాతలకి లాభాల్ని, ఇటు ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్న హీరో నాని రేపు ‘నిన్ను కోరి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకురానున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచి ఈ చిత్రం యొక్క కథను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన సూపట్ హిట్ సినిమా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఆధారంగా రూపొందించారని రూమర్లు మొదలయ్యాయి.

ఈ రూమర్లు బాలీవుడ్ వరకు వ్యాపించడంతో సంజయ్ లీలా బన్సాలి చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కు ఫోన్ చేసి రూమర్ల గురించి అడిగారని, దాంతో కోన సుమారు అరగంట సేపు ఆయనకు సినిమా కథను చెప్పారని, ఆ కథ విన్న బన్సాలి చాలా బాగుందని, కొంచెం ఈర్ష్యగా కూడా ఉందని అన్నారని, ఇది తమ సినిమాకు అందిన గొప్ప కాంప్లిమెంటని నాని అన్నారు. మరోవైపు సినిమా యొక్క స్పెషల్ షో వీక్షించిన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సినిమా చాలా బాగుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook