బ్రేకింగ్ : ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ కీలక భేటీ.!

Published on Jan 13, 2022 8:47 am IST

గత కొన్నాళ్ల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో టికెట్ ధరలు సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించి అనేక ఊహించని సంఘటనలు మలుపులతో పరిస్థితులు ఎంత రసవత్తరంగా మారాయో చూసాము. మరి ఈ సందర్భంలో టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు సహా హీరోలకి మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నేతలకి నడుమ అనేక మార్లు కీలక సమావేశాలు కూడా జరిగాయి కానీ వాటి వల్ల ఇప్పటి వరకు కూడా అంత సానుకూల ఫలితాలు అయితే ఇండస్ట్రీకి రాలేదు.

మరి ఈ అంశంపై టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా పలు మార్లు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఇష్యూ పై స్వయంగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ ని మీట్ అయ్యేందుకు రెడీ అయ్యినట్టు ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ని చిరు మీట్ అయ్యి టికెట్ ధరలు ఇతర అంశాలకు సంబంధించి చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ భేటీ తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది.అయితే ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి మెగాస్టార్ విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట తరువాత సీఎం జగన్ ను కలిసి టికెట్ ధరల సమస్యపై చర్చించనున్నారు.

సంబంధిత సమాచారం :