‘రంగస్థలం’లో రామ్ చరణ్ కామెడీ యాంగిల్ చూడొచ్చట !
Published on Feb 16, 2018 8:00 am IST

రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ ముగింపు పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మొదటి పాట అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. చరణ్ పూర్తిస్థాయిలో లుక్ మార్చి భిన్నంగా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఆయనలోని కామెడీ యాంగిల్ పూర్తిగా బయటపడుతుందట.

కథ ప్రకారం చరణ్ వినికిడి లోపం కలిగి ఉంటాడు. ఆ అంశం మీదే మంచి హాస్యం పండుతుందని, ఇప్పటి వరకు చరణ్ ను అలాంటి హ్యూమర్ ఉన్న పాత్రలో చూసి ఉండరని చిత్ర సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఇన్నాళ్లు మాస్ క్యారెక్టర్లతో మెప్పించిన చరణ్ ఈసారి ఎలాంటి వినోదాన్ని అందిస్తారో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటించారు.

 
Like us on Facebook