నాగార్జున సినిమాపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ !
Published on Mar 11, 2018 11:07 am IST


ఆర్జీవీ నిర్మాణ సంస్థ కంపెనీ నిర్మాణంలో సీనియర్ హీరో నాగార్జున ప్రధాన పాతరలో రూపొందుతున్న చిత్రం ‘ఆఫీసర్’. నాగార్జున, ఆర్జీవీల కలయికలో గతంలో ‘శివ’ లాంటి బ్లాక్ బస్టర్ రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలొచ్చాయి. కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదని, మీడియావారు ఇలాంటి వార్తల్ని ప్రచురించే ముందు తమని సంప్రదించాలని నిర్మాణ సంస్థ కంపనీ క్లారిటీ ఇచ్చింది.

 
Like us on Facebook