పుష్పరాజ్ ఐకానిక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేసిన క్రికెటర్ డ్వేన్ బ్రావో

Published on Jan 25, 2022 7:34 pm IST

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రైజ్ యొక్క క్రేజ్ అసాధారణమైనది గా ఉంది. దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇది హద్దులు దాటి వెళుతోంది. కొద్ది రోజుల క్రితం క్రికెటర్లు డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో చేరాడు. శ్రీవల్లి పాటలో అల్లు అరుణ్ సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేసి ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేశాడు. ఈ వీడియో లో డ్వేన్ బ్రావో చాలా బాగా చేసాడు, అతని డ్యాన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం ఆన్‌లైన్‌లో సంచలనంగా మారింది. ప్రముఖులతో పాటు చాలా మంది అభిమానులను సంపాదించుకుంది పుష్ప చిత్రం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :