“భీమ్లా నాయక్” చిత్రం నుంచి “డేనియల్ శేఖర్” గా రాణా పరిచయ చిత్రం విడుదల

Published on Sep 20, 2021 6:22 pm IST

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. స్క్రీన్ ప్లే, సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

భీమ్లా నాయక్ చిత్రం నుంచి రాణా పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం. డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది.

“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట? స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర, హీరో… హీరో…డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్” అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :