‘భోగి’ బ్లాస్టింగ్ టీజర్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

‘భోగి’ బ్లాస్టింగ్ టీజర్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Published on Oct 2, 2026 7:00 PM IST

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఊరమాస్ అప్‌‌డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శర్వాసంపత్ బ్లడ్ ఫెస్ట్ అనే హ్యాష్‌‌ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. సంపత్ నంది మార్క్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ టీజర్ కోసం శర్వా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు