హిందీ ‘దృశ్యం 3’కి మైండ్ బ్లాకింగ్ బుకింగ్స్!

హిందీ ‘దృశ్యం 3’కి మైండ్ బ్లాకింగ్ బుకింగ్స్!

Published on Oct 2, 2026 4:57 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఫైనెస్ట్ సినిమా ఫ్రాంచైజ్ లో మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయ్యిన దృశ్యం సిరీస్ కూడా ఒకటి. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాని జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. అలాగే అనేక భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ చేశారు. ఇలానే హిందీలో కూడా చేసారు.

స్టార్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా పార్ట్ 3 మాత్రం ఒరిజినల్ తో సంబంధం లేకుండా పార్ట్ 3 తోనే ముగించేస్తూ ఎండ్ చేశామని మేకర్స్ తెలిపారు. ఇక ఎట్టకేలకు నేడు థియేటర్స్ లో విడుదల అయ్యిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ కనబరుస్తూ షాకిచ్చింది.

గంటకి ఏకంగా 70 వేలకి పైగా టికెట్ సేల్స్ తో మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ ని బుక్ మై షోలో చూపిస్తుంది. ఇది కూడా కేవలం ఒక్క హిందీ వెర్షన్ లోనే కావడం గమనార్హం. ఇక ఈ బుకింగ్స్ ఇలా ఉంటే ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా టబు, అక్షయే ఖన్నా అలాగే శ్రియా శరన్ తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు