నందమూరి బాలకృష్ణ గాయపడటంతో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘దాదా’ షూటింగ్ కొంతకాలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటుండటంతో చిత్ర బృందం మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. రాబోయే సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు భారీ చిత్రాలు పోటీలో ఉండటంతో, బాలయ్య ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటికే బాలకృష్ణ లేని సన్నివేశాల షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశారు. ఈ క్రిస్మస్ రేసులో నిలవాలంటే రాబోయే రెండు నెలల్లో సినిమా పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం బాలకృష్ణ నెక్స్ట్ రెండు నెలల పాటు వరుస షెడ్యూళ్లకు అందుబాటులో ఉండనుండగా, చిత్ర యూనిట్ కూడా అహోరాత్రులు శ్రమించాల్సి రానుంది.
వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిర్ణీత గడువులోగా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి క్రిస్మస్‌కి సినిమాను తీసుకురావడం చిత్ర బృందానికి పెద్ద సవాలుగానే మారనుంది.


