డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “లవ్ టుడే”

డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “లవ్ టుడే”

Published on Apr 20, 2023 3:06 PM IST

తమిళ చిత్రం లవ్ టుడే టికెట్ విండోస్ వద్ద భారీ హిట్ సాధించింది. ప్రదీప్ రంగనాథన్, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులో అదే పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రసారం అయ్యింది.

ఒక డబ్బింగ్ చిత్రం అయిన లవ్ టుడే 6.02 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టింది. ఇది చాలా మంచి రేటింగ్ అని చెప్పాలి. సత్యరాజ్, రాధిక, శరత్‌కుమార్, యోగి బాబు, రవీనా రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లవ్ టుడే చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు