సమీక్ష : దేశంలో దొంగలు పడ్డారు – నిరుత్సాహ పరిచే క్రైమ్ డ్రామా

సమీక్ష : దేశంలో దొంగలు పడ్డారు – నిరుత్సాహ పరిచే క్రైమ్ డ్రామా

Published on Oct 4, 2018 4:19 PM IST
Natakam movie review

విడుదల తేదీ : అక్టోబర్ 04, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ :1.5/5

నటీనటులు : ఖయ్యుమ్ అలీ, లోహిత్ కుమార్, పృథ్వి రాజ్, సమీర్, షాని సోలొమాన్, తనిష్క్ రాజన్.

దర్శకత్వం : గౌతమ్ రాజ్ కుమార్

నిర్మాతలు : రామ గౌతమ్

సంగీతం : శాండీ

సినిమాటోగ్రఫర్ : శేఖర్ గంగనమోని

నూతన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’. సారా క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

శక్తి (ఖ‌యూమ్‌), జిజ్జు (షాని) చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ట్రాప్ చేసి దొంగతనాలు చేస్తుంటారు. అయితే శక్తికి డబ్బు పై ఆశ లేకపోయినా జిజ్జు ఫ్రెండ్షిప్ కోసం అతనికి సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో జిజ్జు భారీ మొత్తంలో డబ్బులు గుంజటానికి సీత (తనిష్క్ రాజ‌న్‌)ని కిడ్నాప్ చేస్తాడు. సీతతో ఎంతో అవసరం ఉన్న పృథ్వి రాజ్ ఆమెను, జిజ్జు నుండి విడిపించటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు.

ఈ క్రమంలో సీత వల్ల జిజ్జుకి, శక్తికి అభిప్రాయభేదాలు వస్తాయి. ఇద్దరూ కొట్టుకొని విడిపోతారు. దాంతో జిజ్జు, పృథ్వి రాజ్ మనుషులతో కలుస్తాడు. శక్తి, సీత వారి నుండి తప్పించుకున్నే క్రమంలో శక్తికి, సీత గతం తెలుస్తోంది. సీతకి అన్యాయం చేసినవారిని ఎలాగైనా అంతం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అసలు పృథ్వి రాజ్ ఎవరు ? సీతతో అతనికి ఏం అవసరం ఉంది ? అయినా సీతకి జరిగిన ఆన్యాయం ఏమిటి ? ఆ ఆన్యాయం చేసినవారిని శక్తి చివరికి ఏం చేస్తాడు ?లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన ఖ‌యూమ్‌ తన నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో తన అనుభవంతో చక్కగా నటించాడు. ఆసాంతం బోర్ కొట్టించే ఈ సినిమాలో షాని, పృథ్వి రాజ్, సమీర్, లోహిత్ తమ నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు.

హీరోయిన్ గా నటించిన తనిష్క్ రాజ‌న్‌ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. జీవితంలో తీవ్రమైన ఆన్యాయానికి గురైన అమ్మాయిగా, లోలోపలే నరకాన్ని అనుభవిస్తూ చావలేక బతుకుతున్న సీత అనే ఓ అమ్మాయి పాత్రలో తనిష్క్ రాజ‌న్‌ తన నటనతో మెప్పిస్తోంది. ముఖ్యంగా తన గతం రివీల్ చేసే సన్నివేశాల్లో ఆ సంఘటనల తాలూకు హావభావాలు ఆమె బాగా పలికించింది.

ఇక ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. సమాజంలో అమ్మాయిల పై జరుగుతున్న దారుణమైన కొన్ని వాస్తవాలను దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు.
మైనస్ పాయింట్స్:

అమ్మాయిల పై సమాజంలో జరుగుతున్న అత్యంత దారుణమైన విషయాన్ని తన సినిమా కాన్సెప్ట్ గా రాసుకున్న దర్శకుడు, ఆ కాన్సెప్ట్ కు తగిన విధంగా, అలాగే ఆసక్తికరంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో మాత్రం విఫలమైయ్యాడు. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా వరకు విసుగు తెప్పిస్తాయి తప్ప ఆకట్టుకోవు.

సినిమాలో బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది.

పైగా ప్రధాన పాత్రల్లో నటించిన నటులు కూడా అక్కడక్కడా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు.. కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ తో, ప్లో లేని స్క్రీన్ ప్లే తో సినిమా పై ఉన్న ఆ కాస్త ఆసక్తిని కూడా నీరుగారిస్తారు.
సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ స్టోరీ ఐడియా మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ ఐడియాని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. పైగా ఉన్న స్క్రిప్ట్ ని కూడా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.

సంగీత దర్శకుడు శాండీ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా చిత్రానికి అనుగుణంగానే సాగుతుంది. కెమెరా బాధ్యతలను నిర్వహించిన శేఖర్ గంగ‌న‌మోని తమ కెమెరాతో మ్యాజిక్ చేయకపోయినా పర్వాలేదనిపించాడు.

ఎడిటర్ మ‌ధు.జి.రెడ్డి ఎడిటింగ్ పనితనం అస్సలు ఆకట్టుకోదు. నిర్మాతలు తమ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం పెంచి ఉండాల్సింది.
తీర్పు :

నూతన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో ఖ‌యూమ్‌, తనిష్క్ రాజ‌న్‌ కీల‌క పాత్ర‌ల్లో వచ్చిన `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకున్నే విధంగా లేదు. సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ బాగుంది కానీ, ఆ పాయింట్ కి తగట్లు కథ కథనాలను దర్శకుడు ఆసక్తికరంగా ఆకట్టుకున్నే విధంగా రాసుకోలేకపోయాడు. పైగా సినిమా ఆసాంతం విసుగు తెప్పిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు