చైతూ తదుపరి సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్!

10th, September 2016 - 01:17:31 PM

naga-chatanya
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకునే పనిలో పడిపోయారు. చైతూ కెరీర్ విషయమై కింగ్ నాగార్జున కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో నాగార్జున మరో సినిమా నిర్మించనున్నారు. నాగ చైతన్య హీరోగా నటించనున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభం కానుండగా, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పనిచేయనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్‌లో పాల్గొంటున్నారట. ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో పాటు ఇకపై చేయబోయే సినిమాలు పకడ్బందీగా ఉండాలని, హీరోగా తనదైన మార్క్ సృష్టించుకోవాలని చైతన్య ప్లాన్ చేస్తున్నారట. ప్రేమమ్ అక్టోబర్‌లో విడుదల కానుండగా, అదే నెల్లో సాహసం శ్వాసగా సాగిపో కూడా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.