జాతీయ అవార్డు గ్రహీతలు ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో తెరకెక్కతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ఓం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త డేట్‌ను ప్రకటించారు మేకర్స్. తాజాగా నవంబర్ 20, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తుందని మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అన్‌సంగ్ హీరోస్ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపురమ్ ఫిల్మ్స్ పతాకంపై అన్బుచెళియన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.


