డిసెంబర్‌‌కు వెళ్ళిపోయిన ‘ధృవ’..!
Published on Sep 26, 2016 2:09 pm IST

dhruva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్‍ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మొదట ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని టీమ్ భావించినా, ప్రొడక్షన్ పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో సినిమాను వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ప్రకటించలేదు.

ఇక తాజాగా ఇదే విషయమై టీమ్ తెలిపిన వివరాల ప్రకారం ‘ధృవ’, డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుందని స్పష్టం అయింది. ప్రస్తుతానికి ఆరు రోజుల టాకీ పార్ట్, రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తైందట. రామ్ చరణ్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనుండడం, తమిళంళో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ కావడం, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించడం ఇలా ఎన్నో కారణాలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న ఈ సినిమా గురించి అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook