NBK108: గిది శాంపిల్ మాత్రమే – అనిల్ రావిపూడి

NBK108: గిది శాంపిల్ మాత్రమే – అనిల్ రావిపూడి

Published on Mar 23, 2023 12:32 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లను నిన్న మేకర్స్ ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ మేకొవర్ పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ పట్ల చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా లో సరికొత్త పోస్ట్ చేయడం జరిగింది. ఆ లుక్కే అన్నిటినీ చెబుతుంది, గిది శాంపిల్ మాత్రమే అంటూ మరొక ఫోటో ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు