ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసి ముగ్దుడైపోయిన డైరెక్టర్ !
Published on Jul 26, 2017 4:59 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు ఆయన నుండి అభినయంతో పాటు హోరెత్తించే డ్యాన్సులు కూడా కోరుకుంటుంటారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తారక్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గకుండా సినిమాలో మంచి పాటలు,నృత్యాలు ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రస్తుతం అయన నటిస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్ పూణేలో జరుగుతోంది. అది కూడా పాటల చిత్రీకరణ.

ఈ పాటలు షూట్ చేసే సమయంలో తారక్ డ్యాన్సులు దుమ్ము రేపాడట. తారక్ గ్రేస్ చూసిన దర్శకుడు బాబీ ఆశ్చర్యపోతూ ‘ఎన్టీఆర్ గారు నా కళ్ళ ముందు డ్యాన్స్ చేయడం నమ్మలేని అనుభవం. ఆయనకు పుట్టుకతోనే డ్యాన్స్ లక్షణాలున్నాయి. ఆ డ్యాన్స్ ను ప్రత్యక్షంగా చూడటం నా అదృష్టం’ అంటూ పొగిడేశారు. మరి బాబీని అంతలా ఇంప్రెస్ చేసిన ఆ నృత్యాలు స్క్రీన్ మీద ఈ స్థాయిలో ఉంటాయో చూడలేనట సెప్టెంబర్ 21 వరకు ఆగాలి. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా నివేతా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 
Like us on Facebook