వైరల్ వీడియో : దేవిశ్రీప్రసాద్ తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సాంగ్ ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ బాబీ

వైరల్ వీడియో : దేవిశ్రీప్రసాద్ తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సాంగ్ ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ బాబీ

Published on Dec 27, 2022 9:21 PM IST


మెగాస్టార్ చిరంజీవి తో ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీ పై మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి.

ముఖ్యంగా వాల్తేరు వీరయ్య నుండి నిన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వస్తుంది. కాగా ఈ పవర్ఫుల్ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి కారులో షికారు చేస్తూ డైరెక్టర్ బాబీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తామిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన బాబీ, ఈ సాంగ్ కి సర్ జి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్ అందించినందుకు థాంక్స్ అంటూ పోస్ట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

https://twitter.com/dirbobby/status/1607696765389766656?s=20&t=gf1DUEaYGTHC2gj1kW-P7Q

సంబంధిత సమాచారం

తాజా వార్తలు