పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ దేవకట్టా థాంక్స్!

Published on Sep 24, 2021 12:37 am IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయగా, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ 5 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చిత్ర యూనిట్ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ కొరకు పవన్ కళ్యాణ్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ వీడియో తో రిపబ్లిక్ చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ తెలపడం జరిగింది. చిత్ర దర్శకుడు దేవకట్టా పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెబుతూ ఒక వీడియో ను పోస్ట్ చేశారు. ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ చిత్రం ను అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, రమ్యకృష్ణ, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :