నేషనల్ అవార్డు డైరెక్టర్ తో ‘హ్యాపీడేస్’ హీరో!
Published on Oct 28, 2017 10:57 am IST


2006లో వచ్చిన ’హోప్’ అనే సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సతీష్ కాషెట్టి. ఆయన తీసిన తన రెండో సినిమా ’కలవరమాయె మదిలో’ సినిమాతో నంది అవార్డ్ కూడా పొందాడు. ఈ మద్య ‘టెర్రర్’ అంటూ తన మూడో సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘టెర్రర్ సినిమా కూడా పెద్ద విజయం సాదించింది. కొంత గ్యాప్ తరువాత ఈ డైరెక్టర్ మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే…

‘హ్యాపీడేస్’ సినిమా లో శంకర్ పాత్ర లో కనిపించిన ‘వంశీ’ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల ఈ సినిమాకు కథా మాటలు అందిస్తున్నారు, గతంలో సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ‘టెర్రర్’ సినిమాకు మాటలు అందించిది కూడా లక్ష్మి భూపాల కావడం విశేషం. ఇదివరుకు సినిమాలకు మాటలు అందించిన లక్ష్మి భూపాల ఈ సినిమా తో కథలు అందిస్తుండడం విశేషం. ఈ సినిమాతో పాటు మరో రెండు క్రేజి ప్రాజెక్ట్స్ కు కథలు అందిస్తున్నారు.

 
Like us on Facebook