“డీజే టిల్లు” ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jan 31, 2022 10:00 pm IST

సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం “డీజే టిల్లు”. నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఫిబ్రవరి 2, 2022న సాయంత్రం 04:05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం :