ప్రత్యేక ఇంటర్వ్యూ: డీవోపి మధి – సినిమాని ఏ భాషలో చూస్తే బాగుంటుందని మహేష్ అడిగారు
Published on Feb 20, 2017 2:17 pm IST


‘మిర్చి, శ్రీమంతుడు, రన్ రాజా రన్ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన మధి తాజాగా చేసిన చిత్రం ‘ఘాజి’. ఈ సినిమాలో ఆయన పనితనానికి గాను గొప్ప ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ సందర్బంగా ఆయనతో మేము జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్ర) ఈ ‘ఘాజి’ గురించి మీకెలా తెలిసింది ?
జ)‘మిర్చి’ సక్సె మీట్ సమయంలో ఈ కథ గురించి కొంత విన్నాను. ఆ తరువాత సమయం గడిచే కొద్ది ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యేకొద్ధి నేను కూడా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను.

ప్ర) సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) స్వయంగా మహేష్ బాబు ఫోన్ చేసి విష్ చేశారు. అలాగే ఈ సినిమాని ఏ భాషలో చూస్తే రియల్ ఫీల్ కలుగుతుంది అని దాపరికం లేకుండా అడిగారు. తెలుగులో ఇలాంటి సినిమా ట్రై చేయడం మొదటిసారి కాబట్టి తెలుగులోనే చూడమని సలహా ఇచ్చాను.

ప్ర) సబ్ మెరైన్ సెట్లో షూట్ చేయడంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా ?
జ) ముందుగా సినిమాని ఎలా చూపాలి అనే దానికి మా దగ్గర ఎలాంటి రెఫరెన్సెస్ లేవు. మేము సినిమాలో ఏదైతే చూపామో అదంతా మా ఇమాజినేషన్, హార్డ్ వర్క్. సెట్లో షూట్ కి ఎక్కువ స్పేస్ ఉండదు కనుక మేము లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించలేదు. అప్పటికప్పుడు మాకు అనుకూలమైన సెటప్ ని రూపిందించుకుని సౌకర్యంగా పని చేశాం.

ప్ర) షూటింగ్లో అతి కష్టమైన షాట్ ఏది ?
జ) గమనిస్తే సబ్ మెరైన్ లో పేలుడు జరిగినప్పుడు అన్ని లైట్స్ ఆగిపోయి అంతా చీకటైపోతుంది. ఆ సీన్ కు ముందు చీకటైపోవడాన్ని ప్రేక్షకులకి చాలా క్లియర్ గా చూపించాలి. అది కాస్త కష్టమైన షాట్.

ప్ర) సంకల్ప్ రెడ్డితో పని చేయడం ఎలా ఉంది ?
జ) కొత్త దర్శకులతో పనిచేయడంలో కొంత లాభం,కొంత కష్టం ఉంటుంది. కొత్తగా వాళ్ళైతే కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు. లాంటివారితో పనిచేయడం నిజంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అదే సమయంలో వాళ్లకు సన్నివేశం స్క్రీన్ మీద ఎలా ఉంటుందో వివరించాలి. వాళ్ళు రాసుకున్నదానికి, స్క్రీన్ మీద కనబడే దానికి చాలా తేడా ఉంటుంది.

ప్ర) రానా, ఇతర నటీనటులతో పనిచేయడం ఎలా ఉంది ?

జ) అలాంటి నటీనటులతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. సినిమా బాగా రావాలని అందరూ కష్టపడ్డారు. ముఖ్యంగా రానా అయితే చాలా సిన్సియర్ గా కష్టపడ్డాడు. అతనికి ఈ విజయంలో ఎక్కువ భాగం దక్కాలి.

ప్ర) పివిపితో పని చేయడం ఎలా ఉంది ?
జ) పివిపితో తమిళంలో ఒక సినిమా చేశాను. కానీ అది సరైన ఫలితం ఇవ్వలేదు. అప్పుడే వారికి ఒకరోజు మీకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలో పనిచేస్తాను అని చెప్పాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) నెక్స్ట్ ప్రభాస్ సినిమాకి పనిచేయాలి. అది భారీ సినిమా. వివిధ భాషల్లో రూపొందుతోంది. భిన్నమైన లొకేషన్లో షూట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న.

 
Like us on Facebook