100 కోట్ల క్లబ్‌లో చేరిన “ఎఫ్3”

Published on Jun 5, 2022 9:03 pm IST


విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ మరోసారి జోడీ కట్టి ఎఫ్3తో భారీ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా కథానాయికలుగా నటించారు. తాజా వార్త ఏమిటంటే, ఎఫ్3 చిత్రం 9వ రోజు అంటే ఈరోజు 100 కోట్ల క్లబ్బు లోకి చేరడం జరిగింది.

ప్రస్తుతానికి ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 102 కోట్ల గ్రాస్ రావట్టినట్లు తెలుస్తోంది. ఎఫ్3 గ్రాండ్ సక్సెస్‌తో టీమ్ చాలా హ్యాపీగా ఉంది. శిరీష్ నిర్మించిన ఈ కామెడీ మూవీలో సోనాల్ చుహాన్, సునీల్, అలీ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :