తమ స్టార్ హీరోని అవమానించారంటూ ఆగ్రహిస్తున్న అభిమానులు !

Published on Jul 10, 2018 8:45 am IST

కన్నడ స్టార్స్ శివరాజ్‌కుమార్‌, కిచ్చా సుధీప్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది విలన్‌’. ప్రేమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చుట్టూ ప్రస్తుతం వివాదం చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్యే రిలీజ్ అయిన ‘ది విలన్‌’ టీజర్‌, స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ ను అవమానపరిచే విధంగా ఉందంటూ ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ ఆరోపణల పై ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌, శివరాజ్‌ కుమార్‌ అభిమానులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. శివరాజ్‌ కుమార్‌ గారు ఆయన పాత్రకు నిజంగా అవమానం జరిగిందని భావిస్తే.. నేను ఆయన అభిమానులు ఏం చెప్పినా చేస్తానని దర్శకుడు ప్రేమ్‌ తెలిపారు. మరి ఇప్పటికైనా శివరాజ్‌ కుమార్‌ అభిమానులు ఈ వివాదాన్ని వదిలేస్తారేమో చూడాలి. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మిధున్ చక్రవర్తి కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ జన్యా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :