రామ్ చరణ్ లుక్ పట్ల ఫిదా అయిన అభిమానులు !
Published on Jul 20, 2017 8:44 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ కోసం సుమారు రూ. 5 కోట్లతో ఒక ప్రత్యేకమైన సెట్ ను కూడా రూపొందించారు టీమ్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కు సంబందించి నిన్న సాయంత్రం ఒక వర్కింగ్ స్టిల్ బయటకొచ్చింది. అందులో చరణ్ మంచి ఫిజిక్ తో పూర్తి స్థాయి గ్రామీణ యువకుడు ఎలా ఉంటాడో అలానే కనిపిస్తున్నాడు.

ఆ లుక్ చూసిన అభిమానులు చరణ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడని, లుక్ చాలా బాగుందని ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. కొద్దిసేపటి వరకు ఈ లుక్ సోషల్ మీడియా టాప్ ట్రేడింగ్ లో కూడా నిలిచింది. సుకుమార్ దర్సకత్త్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే 1985 కాలంలో జరిగే ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook