రేపు రిలీజ్ కానున్న వంశీ కొత్త చిత్రం యొక్క ఫస్ట్ లుక్ !

5th, April 2017 - 06:06:31 PM


దర్శకుడు వంశీ కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం, హీరోగా రాజేంద్రప్రసాద్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1985 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వంశీ. ఇందులో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ విడుదలై కొన్ని సంచలనాలకు కూడా దారితీసింది.

ఇకపోతే చిత్రం యూనిట్ ఫస్ట్ లుక్ ను రేపు 6వ తేదీ సాయంత్రం 4 గంటల 10 నిముషాలకు రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ వేసవి ఆఖరుకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.