‘గుంటూరోడు’ టీజర్ రిలీజ్‌కు రెడీ!

gunturodu
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో గుంటూరోడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని టీజర్ లాంచ్‌కు సిద్ధమైంది.

మొదట డిసెంబర్ 7నే టీజర్ విడుదలను చేపట్టాలని భావించినా, జయలలిత మరణంతో దీన్ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ ఉదయం 11 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మనోజ్ తెలిపారు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న మనోజ్, టీజర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.