టీవీ ప్రీమియర్ గా “గదర్ 2”

టీవీ ప్రీమియర్ గా “గదర్ 2”

Published on Dec 25, 2023 8:01 AM IST

సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్ వాద్వా, సిమ్రాట్ కౌర్ లు ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అనిల్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా గదర్ 2. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

న్యూ ఇయర్ వేడుకలో భాగం గా త్వరలో ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ అయిన జీ తెలుగు లో ప్రసారం కానుంది. తెలుగు భాషలోనే సినిమా ఆడియన్స్ ను అలరించనుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు