రాజమౌళి టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన గేమ్ మేకర్ !
Published on Feb 9, 2017 1:00 pm IST


దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి-2’ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటే ఆయన మరో పనికి కూడా శ్రీకారం చుట్టారు. అదే బాహుబలి మొబైల్ గేమ్ రూపకల్పన. అందుకోసం ఆర్కా మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ గేమ్ డిజైనర్ మార్క్ స్కాగ్స్ తో కలిసి చర్చలు జరిపారు రాజమౌళి.

మార్క్ స్కాగ్స్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఫార్మ్ విల్లే, సిటీ విల్లే వంటి ప్రముఖ మొబైల్ గేమ్స్ ను తయారు చేశారు. ఈయన రాజమౌళితో జరిపిన చర్చలను గురించి తన ట్విట్టర్ ఖాతాలో మాట్లాడుతూ ‘రాజుగారితో మీటింగ్ ఒక అద్భుతమైన అనుభూతి. ఆయనొక గొప్ప విజన్ ఉన్న దర్శకుడు, మంచి స్టోర్ టెల్లర్. బాహుబలి ప్రాజెక్ట్ లో భాగమవడం చాలా గౌరవంగా ఉంది’ అన్నారు. ఇకపోతే బాహుబలి 2 ను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook