డిసెంబర్ 24 న ప్రారంభం కానున్న గోపీచంద్ 30 వ చిత్రం

Published on Dec 22, 2021 1:01 pm IST

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం లో మరొక సినిమా త్వరలో రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు సూపర్ హిట్ విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. మూడో సారి ఈ కాంబో సిద్దమైంది. గోపీచంద్ 30 సినిమా కోసం వీరు చేతులు కలపడం జరిగింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచి బొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని డిఫెరెంట్ జోనర్ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మరియు శ్రీవాస్ లతో వీరు సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ 30 వ చిత్రం ఈ నెల డిసెంబర్ 24 వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. భూపతి రాజా ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రం లో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :