హీరోపై విరుచుకుపడ్డ ఫ్యాన్స్!
Published on Nov 24, 2016 10:37 pm IST

gv-prakash
తమిళ సినీ పరిశ్రమలో ఒక హీరో అభిమానులకు, మరో హీరో అభిమానులకు ఉన్నంత గొడవలు మరెక్కడా ఉండవు. మా హీరో గొప్పంటే, మా హీరో గొప్పని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిరంతరం గొడవ పడుతూనే ఉంటారు. తాజాగా ఇలాంటిదే ఒక గొడవ జీవీ ప్రకాష్‌కు తలనొప్పిగా తయారైంది. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శనే కనబరిచాయి.

ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చాలా సినిమాలు సెట్స్‌పై ఉండి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఏదైనా సినిమా ఓ పెద్ద హీరోతో తలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దీనిపైనే స్పందిస్తూ జీవీ ప్రకాష్ తన సినిమా పెద్ద హీరోలతో పోటీకైనా సిద్ధం అన్నారట. తమ హీరో సినిమాతో పోటీ పడేంత స్థాయి జీవీ ప్రకాష్‌కు ఉందా అంటూ అభిమానులు విమర్శలు గుప్పించడంతో, జీవీ ప్రకాష్ కూడా అందుకు ఘాటుగానే స్పందించాడట. దీంతో గొడవ ముదిరి ఆయా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్‌ అంతా సోషల్ మీడియాలో జీవీ ప్రకాష్‍పై విరుచుకుపడుతున్నారు. ఆయనను విమర్శిస్తూ పెట్టిన ట్రెండ్‍ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలవడం ఈ గొడవ స్థాయి ఎంతటిదో చెప్పేస్తుంది. మరి ఈ గొడవపై జీవీ ప్రకాష్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

 
Like us on Facebook