నాగ శౌర్య సినిమాలో ఆ హీరోయిన్ పాత్ర ఇదే !
Published on Mar 2, 2018 7:11 pm IST

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి హీరో హీరోయిన్స్ గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుంద‌ర్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. హృద‌యానికి హ‌త్తుకునేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెప్తున్నారు.

బేబి షామిలి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ హీరోయిన్ అమ్మమ్మగారిల్లు సినిమాలో సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. మానవ సంభందాల మీద ఈ సినిమా ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో విడుదల తేదిని అనౌన్స్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook