బాలీవుడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంచలన హిట్ సినిమానే ‘హనుమాన్ అంశ్’. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా బాలీవుడ్ లో ఊహించని లాభాలు అందించింది. ఇక అక్కడ భారీ విజయం అందుకున్న తర్వాత తెలుగు రిలీజ్ కూడా ఖరారు అయ్యింది కానీ తర్వాత మళ్ళీ విడుదల చేతులు మారడం, మరో సంస్థకి వెళ్లడం జరిగింది. ఇక ఫైనల్ గా దీనిపై అధికారిక క్లారిటీ ఇచ్చారు.
కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమా తెలుగు రిలీజ్ ని ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఈ అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. సో ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ మన దగ్గర వస్తుందో చూడాలి. ఈ సినిమాలో షోబినా సత్య ప్రధాన పాత్రలో నటించగా అనుప్రియ, రాగిణి, నమ్రత సింగ్ నిర్మాణం వహించారు.


