ఇంటర్వ్యూ : హెబ్బా పటేల్ – సినిమా రిలీజైవుతుందటే కొద్దిగా కంగారుగా ఉంది !
Published on Nov 1, 2017 3:12 pm IST

‘కుమారి 21 ఎఫ్’ తో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ ఆ తరవాత వరుస ఆఫర్లతో బిజీ బిజీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఆమె నటించిన ‘ఏంజెల్’ చిత్రం ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ‘ఏంజెల్’ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇది రెగ్యులర్ గా మనం చూసే హెవీ సబ్జెక్ట్ కాదు. చాలా సింపుల్ గా, లైట్ గా ఉంటుంది. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన చిత్రం.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలా బబ్లీగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. నేనొక ఏంజెల్. నేను స్వర్గం నుండి భూమ్మీదకు ఎందుకొచ్చాను, హీరోను ఎలా కలిశాను, అతనితో నా జర్నీ ఏంటి అనేదే సినిమా.

ప్ర) అంటే సినిమా మొత్తం మీ మీదే ఉంటుందా ?
జ) అవును. కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. నేను ఇంతకు ముందు చేసిన సినిమాలకన్నా ఇందులో నా భాద్యత కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

ప్ర) రిలీజ్ పట్ల కంగారేమైనా ఉందా ?
జ) అవును. కొద్దిగా కంగారుగా ఉంది. అదే టైంలో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అనే ఆతురత కూడా ఉంది. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. అందరితో పాటు కలిసి చూస్తాను.

ప్ర) హీరో నాగ అన్వేష్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) నాగ్ అన్వేష్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. డ్యాన్సులు బాగా చేస్తాడు. మంచివాడు. ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు.

ప్ర) ఇంతకు ముందు షూటింగ్ నుండి గ్యాప తీసుకుంటాను అన్నారు కదా ఏమైంది ?
జ) అవును తీసుకుంటానన్నాను. కానీ డేట్స్ ముందే ఇచ్చేసి ఉండటం వలన షూటింగ్స్ చేస్తున్నాను.

ప్ర) నటన కాకుండా ఇంకేదైనా రంగంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారా ?
జ) (నవ్వుతూ) లేదు. ఇప్పుడున్న సినిమాలతోనే చాలా కష్టపడుతున్నాను. ఇక వేరే పని అంటే నా వల్ల అస్సలు కాదు.

ప్ర) కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా ?
జ) లేదు. ఇంకా వేటికీ ఒప్పుకోలేదు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒప్పుకుంటే నేనే అనౌన్స్ చేస్తాను.

 
Like us on Facebook