పొలిటికల్ పాత్రను కూడ విజయవంతంగా పోషిస్తానంటున్న రజనీ !
Published on Mar 14, 2018 9:39 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. అందరూ రాజకీయంగా రజనీ ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతారో చూడాలని కుతూహలంగా ఉన్నారు. ప్రస్తుతం రజనీ హిమాలయాల పర్యటనలో ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన పెద్దగా రాజకీయాలు గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాలు పట్ల ఎంత ధృఢంగా ఉన్నది తెలిపారు.

దేవుడు తనకిచ్చిన హీరో పాత్రను 100 శాతం విజయవంతంగా పోషించానన్న రజనీ భగవంతుడు ఇప్పుడు రాజకీయనాయకుడి పాత్రను ఇచ్చాడు. దానిని కూడ విజయవంతంగా పోషిస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఆయన నటించిన తాజా చిత్రాలు ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదలకానుండగా, ‘2 పాయింట్ 0’ కూడ విడుదల సన్నాహాల్లో ఉంది.

 
Like us on Facebook