అఖిల్ ‘హలో’ సినిమాలో చాలా సప్రైజులున్నాయట !
Published on Nov 26, 2017 3:24 pm IST

అక్కినేని అఖిల్ చేస్తున్న రెండవ సినిమా ‘హలో’ పై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిన సంగతే. ఈ చిత్రంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనే నమ్మకంతో అన్నారంతా. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవలే విడుదలై భారీ స్పందనను దక్కించుకుంది.

విక్రమ్ కుమారు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో నాగార్జున, అమల, సమంతలు కొద్దిసేపు కనిపించనున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా ఇంకా ధికారిక ప్రకటన అందలేదు. ఒకవేళ ఇదే గనుకు నిజమైతే అభిమానులకు పండుగనే చెప్పాలి.

కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గ పరిచయమవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook