ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే !
Published on May 17, 2018 5:36 pm IST

‘అజ్ఞాతవాసి’ చిత్రంతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తారక్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తారక్ ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకుని మరీ బరువు తగ్గి కొత్త లుక్ ట్రై చేశారు. తొలిసారి త్రివిక్రమ్ తమ హీరోను డైరెక్ట్ చేస్తుండటంతో నందమూరి అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలను అందుకోవడానికి త్రివిక్రమ్ పక్కా స్క్రిప్ట్ తయారుచేసుకుని చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 20న తారక్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ను 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక విడుదల సమయం ఎప్పుడు అనేది రేపు తెలియనుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook