ఇంటర్వ్యూ: ఆడియన్స్ ఇప్పుడు నన్ను పరిణితి చెందిన పాత్రల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు – నాగార్జున
Published on Oct 3, 2017 5:57 pm IST

ప్ర) క్లీన్ సేవ్ లుక్ వెనుక కారణం ఏమిటి?

జ) ఈ లుక్ లో ప్రత్యేకత అయితే ఏమీ లేదు. సినిమా షూటింగ్ తర్వాత కాస్తా కొత్త లుక్ ట్రై చేద్దామని క్లీన్ సేవ్ చేశా.. అమ్మాయిలందరికీ ఈ లుక్ నచ్చడం. నాకు కూడా ఇంటరెస్టింగ్ గా అనిపించి ఫాలో అయిపోతున్న.

ప్ర) మీ అబ్బాయి చైతూ పెళ్లి గురించి ఎలా అనిపిస్తుంది?

జ) చాలా ఆత్రుతగా అయితే ఉంది. ఎందుకంటే హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి జరగడం వలన రెండు రకాల డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించొచ్చు(నవ్వుతూ). సమంత వారి తల్లిదండ్రుల అభిప్రాయాలకి గౌరవం ఇచ్చి క్రిస్టియన్ సంప్రదాయంలో చేసుకోవడానికి రెడీ అయ్యింది. సమంత అభిప్రాయం నాకు నచ్చింది. అందుకే వారి ఇస్తా ప్రకారం రెండు సంప్రదాయాల్లో పెళ్లి. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నాం.

ప్ర) రాజుగారి గది-2 సినిమా ఆలస్యానికి కారణం?

జ) ఓం కార్, అతని టీంకి నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని. మన దగ్గర భాగా చేస్తారని చెప్పాను. అయితే వాళ్ళు ముంబైలో చేయించాలని అనుకున్నారు. అయితే అక్కడ కంపెనీ అంత భాగా అయితే వర్క్ చేయలేదు. దాంతో మరల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. దానికితోడు పని కూడా చాలా నెమ్మదిగా చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కాపీ చూసా భాగానే వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉంది.

ప్ర) హర్రర్ కామెడీలోలో ఇందులో మీరు చూపించే కొత్తదనం ఏంటి?

జ)హర్రర్ కామెడీ జోనర్ లో మొదటి సారి చేస్తున్న. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడదగ్గ విధంగా ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఈ కథ, అందులో నేను చేసిన మెంటాలిస్ట్ పాత్ర నన్ను భాగా ఎగ్జైట్ చేసింది. మిమ్మల్ని కూడా అలాగే చేస్తుంది.

ప్ర) సమంతతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

జ) తనతో నా వాక్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాలో తను అందరిని నిజంగానే భయపెట్టేసింది. ఓంకార్ ఆమె పాత్రని చివరి 20 నిమషాలు చాలా గ్రిప్పింగ్ గా రూపొందించాడు. ఇక మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు అయితే సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

ప్ర)వయసు పాత్రలల విషయంలో మిమ్మల్ని మీరు ఎలా మలుచుకుంటున్నారు?

జ) ఇప్పటి తరం దర్శకులు నాకు సరిపోయే పాత్రలు సృష్టిస్తున్నారు. ఇంకా కొన్ని పాత్రల కోసం నన్ను నేను మలుచుకుంటున్న. ఇంకా రొమాన్స్, సాంగ్స్ అంటూ పాత్రలు చేయడానికి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మనకంటూ సరిపోయే పాత్రలను చేయడానికి ప్రయారిటీ ఇస్తున్న.

ప్ర) జుద్వా 2 రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారా?

జ) ఆ సినిమా ప్రొడ్యూసర్స్ నాకు కాల్ చేసి సినిమా చూడమని చెప్పారు. అలాగే తెలుగులో రీమేక్ చేయమని కూడా సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి నేను చాలా బిజీగా ఉండటం వలన చూడటానికి అవకాశం లేదు. అయితే ఫ్రీ అయ్యాక సినిమా చూసి అప్పుడు ఆలోచిస్తా.

ప్ర) ప్రస్తుతం పెద్ద ప్రొడ్యూసర్స్ సినిమాలని ఫెస్టివ్ సీజన్ లో రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి?

జ)ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ లో ట్రావెల్ చేస్తున్నారు. వారికి దొరికే ఫ్రీ టైం వీకెండ్స్, పండగ రోజులే. ప్రొడ్యూసర్స్ కూడా స్టార్ హీరోల మీద పెట్టుబడి భారీగా పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కలెక్షన్స్ తిరిగి రాబట్టుకోవాలంటే ఫెస్టివ్ సీజన్ లోనే రిలీజ్ చేసుకోవాలి.
ప్ర)చివరిగా రాజు గారి గది -2 గురించి?

జ) ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ఉంటూ ఎమోషనల్ గా నడిచే కథాంశం కూడా ఉంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం నాకు ఫుల్ గా ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను.

 
Like us on Facebook