లేటెస్ట్ : ఎన్టీఆర్ ‘సింహాద్రి’ రీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Published on Mar 31, 2023 2:19 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న మూవీ సింహాద్రి. ఈ మూవీలో నమ్మిన బంటు సింహాద్రిగా ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ కి అందరి నుండి విపరీతమైన ప్రసంశలు కురిసాయి. అంకిత, భూమిక హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని ఆద్యంతం ఆకట్టుకునే రీతిన అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి.

ఇక ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ గా పాపులర్ అయ్యాయి. ఇక ఈ సూపర్ డూపర్ హిట్ మూవీని అతి త్వరలో రీ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్ డి తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో రీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్. నిజంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని, తప్పకుండా ఇది మూవీ రీ రిలీజ్ పై క్రేజ్ ని మరింతగా పెంచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కాగా సింహాద్రి రీ రిలీజ్ డేట్ అతి త్వరలో అధికారికంగా అనౌన్స్ కానుంది.

సంబంధిత సమాచారం :