టాక్..మెగాస్టార్ నుంచి మరో కంప్లీట్ ఎంటర్టైనర్?

టాక్..మెగాస్టార్ నుంచి మరో కంప్లీట్ ఎంటర్టైనర్?

Published on May 4, 2023 3:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత తాను చేస్తున్న మరో చిత్రం “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

అయితే మెగాస్టార్ రీసెంట్ గా పలు సీరియస్ డ్రామా లు కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ మెగా ఫ్యాన్స్ అయితే తన నుంచి వీరయ్య లాంటి కంప్లీట్ ఎంటర్టైనర్స్ ని ఆశిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య తర్వాత అయితే ఇప్పుడు మెగాస్టార్ మరో కంప్లీట్ ప్యాకెడ్ ఎంటర్టైనర్ ని అయితే చేయనున్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అయితే ఈ సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వరకే మెగాస్టార్ పలు కథలు వింటున్నారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు